పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఇస్మార్ట్ భామ నిధి అగర్వా ల్ జంటగా నటిస్తున్న పిరియాడికల్ డ్రామా మూవీ హరిహర వీరమల్లు. బాలీవుడ్ యాక్టర్, దర్శకనిర్మాత అనుపమ్ ఖేర్, అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నా రు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీని ఏఎం రత్నం సమర్పణలో మేఘ సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏ దయాకర్రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటంటే ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ ఉండబోతుంది. ఈ సాంగ్ లో పవన్ కల్యాణ్ తో పూజిత పొన్నాడ, అనసూయ భరద్వాజ్ డ్యాన్స్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని అనసూయ ఓ టీవీ రియాలిటీ షోలో చెప్పేసింది. అదిరిపోయేలా స్టెప్పులుంటాయని అనసూయ చెప్పుకొచ్చింది. ఈ పాటకు గణేశ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయబోతున్నాడట. ఎంఎం కీరవాణి మ్యూజిక్ విజువల్ ట్రీట్ గా ఉండబోతుందని సమాచారం.