Kalki OTT Release Date : క్రేజీ న్యూస్ .. ఆగస్టు 23 నుంచి ఓటీటీలో కల్కి
నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2989 AD మూవీ రూ.1,000 కోట్లకు పైగా కలెక్షన్లతో అదరగొట్టింది. థియేటర్లలో చూడని వారు OTT రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓ క్రేజీ న్యూస్ బయటికొచ్చింది. ఈ నెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అదేరోజున హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతుందని తెలుస్తోంది.
'కల్కి 2898 ఏడీ' సినిమా జూన్ 27న తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. రూ. 1100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బాక్సాఫీస్ బరిలో చరిత్ర సృష్టించింది. థియేటర్లలో విడుదలైన 45 రోజుల తర్వాత కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇప్పుడీ సినిమాను ఓటీటీలోకి తీసుకు రావడానికి రెడీ అయ్యింది అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ.
అయితే ఓటీటీ స్ట్రీమింగ్ విడుదలలో థియేట్రికల్ రీల్ నుండి దాదాపు 6 నిమిషాల ఫుటేజీని తగ్గించే అవకాశం ఉందని కొన్ని ఊహాగానాలు సాగుతున్నాయి. ఇటీవలి కొన్ని సినిమాలు ఓటీటీలోకి వచ్చాక తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొనడంతో ఇప్పుడు కల్కి విషయంలో ట్రిమ్డ్ వెర్షన్ ని రిలీజ్ చేసేందుకు ఆస్కారం ఉందని ఊహిస్తున్నారు