Naga Chaitanya : నాగ చైతన్య ఆ సాహసం చేస్తున్నాడా..?

Update: 2024-10-15 10:41 GMT

అక్కినేని నాగ చైతన్య కొన్నాళ్ల క్రితం విజయాలతో ఫామ్ లోకి వచ్చాడు. బట్ దాన్ని కంటిన్యూ చేయడంలో కొంత ఫెయిల్ అయ్యాడు. అయితే ప్రస్తుతం అతని లైనప్ స్ట్రాంగ్ గా ఉందంటున్నారు. కంటెంట్ బలంగా ఉంటేనే కమిట్ అవుతున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు చందు మొండేటి డైరెక్షన్ ‘తండేల్’ అనే సినిమా చేస్తున్నాడు. కార్తికేయ2 తో చందు మొండేటి ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను మెప్పించాడు. అందుకే ఈ చిత్రాన్ని కూడా దేశవ్యాప్తంగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండటంతో మరికొంత అంచనాలు పెరిగాయి. శ్రీకాకుళం జిల్లాలోని కొందరు జాలరుల జీవితాల్లో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల నేపథ్యంలో దేశభక్తిని కూడా జోడించి రూపొందిస్తున్నట్టుగా మూవీ ఓపెనింగ్ టైమ్ లోనే విడుదల చేసిన వీడియో చూస్తే అర్థం అవుతుంది.

తండేల్ ను ఈ యేడాది డిసెంబర్ 20న విడుదల చేయాలనుకున్నారు. క్రిస్మస్ హాలిడేస్ కూడా కలిసొస్తాయి కాబట్టి ఖచ్చితంగా వర్కవుట్ అవుతుందనేది మేకర్స్ భావన. అయితే తాజాగా తండేల్ విషయంలో ఓ డేరింగ్ డెసిషన్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో నిలపాలనుకుంటున్నారట. ఇప్పటికే సంక్రాంతి బరిలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలయ్య సినిమాతో పాటు వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న మూవీస్ ఉన్నాయి. ఇలాంటి పోటీలో నాగ చైతన్య దిగడం అంటే పెద్ద రిస్క్ అనే చెప్పాలి. గేమ్ ఛేంజర్ పై భారీ అంచనాలున్నాయి. వెంకీ, అనిల్ కాంబోకు ఫ్యామిలీస్ లో తిరుగులేని క్రేజ్ ఉంది. ఇక బాలయ్య గురించి చెప్పేదేముందీ.. ఆయన్ని సంక్రాంతి విన్నర్ అని ఎప్పుడో తేల్చారు. పైగా చైతూ ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్నాడు. ఈ టైమ్ లో వారితో పోటీ పడి ఏ మాత్రం తేడా కొట్టినా అసలుకే మోసం వస్తుంది. మరి ఈ డేట్ మార్చుకుంటారా లేక ఇది జస్ట్ రూమరా అనేది చూడాలి. 

Tags:    

Similar News