నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన 'దసరా' సినిమా ఎంత భారీ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తాజాగా ఈ సూపర్ హిట్ కాంబోలో మరో సినిమాను అనౌన్స్ చేశాడు నాని. చాలా కాలం క్రితమే అనౌన్స్ మెంట్ వచ్చిన ఈ క్రేజీ ప్రాజెక్టు ను 'దసరా' పండుగా సందర్బంగా అధికారికంగా మొదలుపెట్టాడు హీరో నాని. ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ప్రస్తుతం దానికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దసరా లాంటి బ్లాక్ బస్టర్ తరువాత అదే కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.