Mrunal Thakur : ధనుష్‌తో డేటింగ్.. మృణాళ్ ఠాకూర్ ఏమన్నదంటే..?

Update: 2025-08-12 09:45 GMT

చిత్ర పరిశ్రమలో నటీనటుల వ్యక్తిగత జీవితాల గురించి పుకార్లు షికార్లు చేస్తుంటాయి. తాజాగా హీరో ధనుష్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డేటింగ్ లో ఉన్నారనే వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య ఈవెంట్ లలో ఇద్దరు కలిసి కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే వీటిపై స్పందించారు హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ధనుష్ తనకు మంచి స్నేహితుడు మాత్రమే అని అంతకు మించి తమ మధ్య ఏం లేదని స్పష్టం చేసారు. దీంతో వీళ్లు ఇద్దరు ప్రేమలో ఉన్నారన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది.

కాగా ఇటీవల జరిగిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' చిత్ర స్క్రీనింగ్‌కు ధనుశ్ హాజరయ్యారు. అంతే కాకుండా ధనుష్ నటిస్తున్న తేరే ఇష్క్ మే సినిమా ర్యాప్ అప్ పార్టీకి కూడా మృణాళ్ రావడంతో ఇద్దరికీ సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. దీంతో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని...పెళ్లి కూడా చేసుకుంటారనే వార్తలు ఊపు అందుకున్నాయి. అయితే వీటికి చెక్ పెట్టారు నటి మృణాళ్. సన్ ఆఫ్ సర్దార్ సినిమా స్క్రీనింగ్ కి అజయ్ దేవగణ్ ఆహ్వానం మేరకే వచ్చారని... దీన్ని ఎవ్వరు తప్పుగా అర్థం చేసుకోవద్దు" అని కోరారు. ఈ వార్తల్లో నిజం లేదని...నిరాధారమైనవని కొట్టి పారేశారు మృణాళ్ ఠాకూర్.

కాగా, 2022లో సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో తన 18 ఏళ్ల వైవాహిక బంధానికి ధనుశ్ ముగింపు పలికిన విషయం తెలిసిందే. వారికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తాజా వివరణతో పుకార్లకు చెక్ పెట్టారు.

Tags:    

Similar News