హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర విషాదం ఎదురైంది. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్ (67) కన్నుమూశారు. కొంతకాలంగా అన్నవాహిక క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన జులై 28, 2025న మరణించినట్లు తెలుస్తోంది. పాయల్ తన తండ్రి మరణ వార్తను ఆలస్యంగా తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తండ్రి ఆరోగ్యం గురించి గతంలోనూ ఆమె అభిమానులతో మాట్లాడుతూ వచ్చారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న తన తండ్రిని కాపాడుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించానని, కానీ ఆ పోరాటంలో విజయం సాధించలేకపోయానని పాయల్ తీవ్ర భావోద్వేగంతో తెలిపారు. "క్షమించండి నాన్న" అంటూ ఆమె ఒక హృదయవిదారక పోస్ట్‌ను షేర్ చేశారు. పాయల్ రాజ్‌పుత్ తెలుగులో 'RX 100' చిత్రంతో మంచి గుర్తింపు పొందారు.