మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర దెబ్బకు ఫస్ట్ డే చాలా రికార్డులు కనుమరుగు అయ్యాయి. ముఖ్యంగా ఇప్పటి వరకూ తెలుగులో బాక్సాఫీస్ డైనోసార్ గా చెబుతోన్న ప్రభాస్ రికార్డులన్నీ కనుమరుగయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో డే ఒన్ కలెక్షన్స్ రికార్డుల్లో దేవర రెండో స్థానంలో నిలిచింది. ఫస్ట్ ప్లేస్ లో ఆర్ఆర్ఆర్ ఉంది. అంటే ప్రభాస్ రికార్డులు బద్ధలయినట్టే కదా.. ఇక ఫస్ట్ డే వాల్డ్ వైడ్ కలెక్షన్స్ లోనూ దేవర సునామీ క్రియేట్ చేసింది. ఏకంగా 172 కోట్లు వసూళ్లు సాధించి మూవీ రిలీజ్ కు ముందు నెగెటివిటీ స్ప్రెడ్ చేసిన వాళ్ల నోళ్లు మూయించింది. ఫస్ట్ డే 54. 22 కోట్ల ‘షేర్’తో బాక్సాఫీస్ ను షేక్ చేశాడు దేవర.
తెలుగు స్టేట్స్ లో దేవర కలెక్షన్స్ ఏరియాల వారీగా చూస్తే..
నైజాం - 19.32 కోట్లు
వైజాగ్ - 5.47 కోట్లు
గుంటూర్ - 6. 27 కోట్లు
నెల్లూర్ - 2. 11 కోట్లు
కృష్ణా - 3. 02 కోట్లు
ఈస్ట్ - 4. 02 కోట్లు
వెస్ట్ - 3.60 కోట్లు
సీడెడ్ - 10. 41 కోట్లు
ఏపి/ టిజి కలిపి మొత్తం - 54.22కోట్ల
దేవరకు ముందు ఆర్ఆర్ఆర్ 73 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. నిజానికి ఆర్ఆర్ఆర్ కు అనేక ఎసెట్స్ ఉన్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి మాస్ హీరోలు మల్టీస్టారర్ చేశారు. అంతకు మించి రాజమౌళి డైరెక్ట్ చేశాడు. అయినా 73 కోట్లు అనేది చిన్నదే అని ఇప్పుడు దేవరను చూస్తే అర్థం అవుతుంది. ఎన్టీఆర్ ఆరేళ్ల తర్వాత చేసిన సోలో సినిమా. కొరటాల శివ ప్యాన్ ఇండియా దర్శకుడు కాదు.. పైగా ఆచార్య తో డిజాస్టర్ ఇచ్చి ఉన్నాడు. దీనికి తోడు విపరీతమైన నెగెటివిటీ వ్యాప్తి చేశారు. అన్నీ దాటుకుని టాప్ 2లో నిలవడం అంటే అది మ్యాన్ ఆఫ్ మాసెస్ కెపాసిటీ అని అర్థం కావడం లేదూ.. మరి ఇకనైనా నెగెటివ్ రాయుళ్లు అన్నీ మూసుకుని ఉంటారేమో చూడాలి.