తెలంగాణ స్టేట్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటీ అంటే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీస్, ఇన్ ఫ్లూయొన్సర్స్ పై పోలీస్ లు కేస్ లు పెట్టి విచారణ చేస్తుండటం అనే చెప్పాలి. బెట్టింగ్స్ కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోయారు. మరెందరో ఏళ్ల తరబడి సంపాదించిందంతా పోగొట్టుకుంటున్నారు. కుటుంబాలకు కుటుంబాలే చిన్నా భిన్నం అవుతున్నాయి. అందుకే వాటిని ప్రమోట్ చేస్తోన్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కదిలింది పోలీస్ యంత్రాంగం. ఇందులో చాలా పేర్లే ఉన్నాయి. అయితే అందరిలోకీ ఎక్కువ ఆకర్షించింది విజయ్ దేవరకొండ, రానా,ప్రకాష్ రాజ్ లే.కేస్ ఫైల్ అయిన తర్వాత వారు ఇచ్చిన వివరణాలు కాస్త కన్విన్సింగ్ గానే ఉన్నాయి. కానీ అలా అనిపించాల్సింది పోలీస్ లకు కదా. అందుకే వీరిని కూడా విచారణకు పిలుస్తారా.. ప్రశ్నిస్తారా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
వీరిలో విజయ్, రానాలు ' ఆన్‌లైన్ స్కిల్-బేస్డ్ గేమ్స్ చట్టబద్ధంగా అనుమతించబడిన ప్రాంతాలలో మాత్రమే ప్రమోట్ చేశాం' అంటూ ఇచ్చిన వివరణలు దాదాపు ఒకేలా ఉన్నాయి. మరి ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ చట్టానికి లోబడే ఉన్నాయా లేదా అనేది తెలియాల్సి ఉంది. అలాగే ప్రకాష్ రాజ్ తను 9యేళ్ల క్రితం ఆ యాప్ ను ప్రమోట్ చేసింది నిజమే కానీ.. తప్పని తెలుసుకున్నానని, అప్పటికే అగ్రిమెంట్ కావడంతో యేడాది తర్వాత పూర్తిగా వదిలేశానన్నాడు. తర్వాత తన వద్దకు అనేకసార్లు వాళ్లు వచ్చారు అన్నాడు. అయినా నో చెప్పాను అన్నాడు. మరి అప్పుడు చేసిన యాడ్స్ ఇప్పటికీ ఆన్ లైన్ లో కనిపిస్తున్నాయి కాబట్టి ప్రకాష్ రాజ్ ను ప్రశ్నిస్తారా అనేది తెలియాల్సి ఉంది.
మరోవైపు వీరిని ప్రశ్నించడంల అసలు ఉద్దేశ్యం వీరిని అప్రోచ్ అయిన వారి గురించి తెలుసుకోవడమే అనేది తెలుస్తోంది. అంటే వీరిని అప్రోచ్ అయిన వారు ఎవరో తెలిస్తే దాని మూలాల వరకూ వెళ్లొచ్చు అనేది పోలీస్ ల భావన అంటున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ ముగ్గురి గురించి హాట్ టాపిక్ నడుస్తోంది.