Dimple Hayathi: చిక్కుల్లో 'ఖిలాడి' హీరోయిన్ డింపుల్.. ఫేక్ నెంబర్‌తో..

Dimple Hayathi: ఫేక్ కాల్స్, ట్రోలింగ్స్, వేధింపులు లాంటివి కామన్‌గా జరుగుతూ ఉంటాయి.

Update: 2022-02-15 06:48 GMT

Dimple Hayathi (tv5news.in)

Dimple Hayathi: ఫిబ్రవరి 11న విడుదలయిన 'ఖిలాడి' సినిమా గురించి ఇంకా టాలీవుడ్ ప్రేక్షకులంతా మాట్లాడుకుంటూనే ఉన్నారు. చాలావరకు ఖిలాడికి అంతటా పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన ఇద్దరు హీరోయిన్ల గురించి టాలీవుడ్ అంతా మాట్లాడుకుంటోంది. అప్పుడే వీరికి ఆఫర్లు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు కూడా విపరీతంగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఖిలాడి హీరోయిన్ డింపుల్ హయాతి ఓ సమస్యలో చిక్కుకుంది.

కాస్త ఫేమ్ రాగానే వారిని కిందకు లాగడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ క్రమంలో సెలబ్రిటీలు కూడా ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫేక్ కాల్స్, ట్రోలింగ్స్, వేధింపులు లాంటివి కామన్‌గా జరుగుతూ ఉంటాయి. హీరోలకంటే ఎక్కువగా హీరోయిన్సే ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. డింపుల్ హయాతి విషయంలో కూడా అదే జరిగింది.

ఒక వ్యక్తి.. తానే డింపుల్ అని టాలీవుడ్‌లోని పలువురు సెలబ్రిటీలకు మెసేజ్ చేయడం మొదలుపెట్టాడట. ఇది కాసేపటికి డింపుల్ దృష్టికి వచ్చింది. అయితే ఆ నెంబర్ తనది కాదంటూ.. డింపుల్ సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేసింది. 'జాగ్రత్తగా ఉండండి. అస్సలు స్పందించకండి. వాడిని బ్లాక్ చేసి కంప్లయింట్ చేయండి' అంటూ డింపుల్ ఆ నెంబర్‌ను ట్వీట్ చేసింది.

Tags:    

Similar News