Maruthi: దర్శకుడు మారుతి తండ్రి కన్నుమూత..
Maruthi: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కుచలరావు తుదిశ్వాస విడిచారు.;
Maruthi: యాడ్స్ డిజైనర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ యూత్‌ఫుల్ డైరెక్టర్‌గా మారిపోయాడు మారుతి. అలాంటి మారుతి ఇంట విషాదం చోటుచేసుకుంది. మారుతి తండ్రి దాసరి కుచలరావు తన 76వ ఏట కన్నుమూశారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కుచలరావు తుదిశ్వాస విడిచారు. గురువారం ఉదయం ఈ ఘటన జరగడంతో మారుతిని పలువురు సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. తన తండ్రి మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.
మారుతి చివరిగా 'మంచి రోజులు వచ్చాయి' అనే చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఇక ప్రభాస్‌తో ఒక సినిమాను లైన్‌లో పెట్టారు మారుతి. ప్రస్తుతం ఈ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నాడు.