బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ దిశా పటాని ( Disha Patani ).. టాలీవుడ్ తో పాటు సౌత్ లోనూ నటిస్తూ అభిమానులను అలరిస్తోంది. సూర్య హీరోగా వస్తున్న కంగువ సినిమాతో ఆమె కోలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. తాజాగా విడుదలైన కల్కిలోనూ ఈ బ్యూటీ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ప్రస్తుతం వెల్కమ్ టు ది జంగిల్ అనే బాలీవుడ్ మూవీలో నటిస్తోంది. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దిశా పటాని.. తనకు ఉత్తరాది, దక్షణాది సినిమాలనే తారతమ్యాలు లేవని తెలిపింది. అన్ని భాషా చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. కల్కి షూటింగ్ సమయంలో ప్రభాస్ ఇంటి నుంచి భోజనం తెప్పించి.. ఆయనే స్వయంగా వడ్డించేవారని తెలిపింది. సూర్య సరసన కంగువ చిత్రంలో నటించడం సంతోషాన్ని ఇచ్చిందన్న దిశా పటాని.. మొదట తనకు యుద్ధ విమాన పైలట్ కావాలని కోరిక ఉండేదని వెల్లడించింది. కానీ ఇలా నటిగా మారాల్సి వచ్చిందని చెప్పింది. హీరోయిన్ గా రాణిచేందుకు డాన్స్, ఫైట్స్, జిమ్నాస్టిక్ లోనూ ట్రైనింగ్ తీసుకున్నట్లు దిశాపటానీ వెల్లడించింది.