Sr. NTR : మార్చి 29కి ఎన్టీఆర్ కు ఉన్న ఈ సంబంధం తెలుసా

Update: 2025-03-29 10:45 GMT

విశ్వ విఖ్యాత నందమూరి తారక రామారావు పేరు చెబితే కోట్ల తెలుగు గుండెలు పులకించిపోతాయి. నటుడుగా వెండితెరపై ఆయన ప్రతిభ శిఖరమంత. రాజకీయ వేత్తగా తెలుగు భాషంత. అడుగుపెట్టిన అన్ని రంగాల్లోనూ విజయదుందుభి మోగించిన ది గ్రేట్ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగు దేశం ఆవిర్భవించింది 19982 మార్చి 29న. అంటే నేడే. అయితే ఈ తేదీకి ఆయన సినిమా జీవితంలో కొన్ని సంఘటనలకు ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉంది.

ఎన్టీఆర్ నట జీవితంలో లవకుశ సినిమా స్థానం అజరామరం. రాముడుగా ఆయన నటన అనన్య సామాన్యంగా కనిపిస్తుందీ చిత్రంలో. అఫ్ కోర్స్ మిగిలిన అన్ని పాత్రలూ అదే స్థాయిలో కనిపిస్తాయి. ఆ రోజుల్లో ఎడ్ల బండ్లు కట్టుకుని మరి ఈ సినిమాను చూశారు. ఒక రోజు టికెట్స్ దొరక్కపోతే థియేటర్ వద్దే బస చేసి ఆ తర్వాతి రోజు సినిమా చూశాకే ఇళ్లకు వెళ్లారు జనం. ఆ స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది లవకుశ.

లవకుశ తొలి రంగుల పౌరాణిక సినిమా. ఈ చిత్రం విడుదలైంది 1963 మార్చి 29న. ఇక ఆయనే నటించిన తొలి రంగుల సాంఘిక చిత్రం దేశోద్ధారకులు 1973 మార్చి 29న విడుదలైంది. ఇది సూపర్ హిట్. అలా రెండు రంగుల సినిమాల విడుదల తేదీలు మార్చి 29నే కావడం.. ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించినదీ మార్చి 29 కావడం కేవలం యాధృచ్చికం అనుకోలేం. ఎందుకంటే ఆయన ఏం చేసినా అన్ని లెక్కలూ చూసుకునే చేస్తారు.

మరి 1982 మార్చి 29న ప్రకటించిన తెలుగుదేశం పార్టీ ఇంకెంత పెద్ద హిట్టో చరిత్రతో పాటు వర్తమానమూ సాక్ష్యంగా నిలుస్తోంది. 42యేళ్లకు పైగా అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. 

Tags:    

Similar News