Sree Leela : డాక్టర్, యాక్టర్ రెండూ కావాలనుకున్నా.. శ్రీలీల మనసులో మాట

Update: 2024-05-14 05:44 GMT

సినీ తారల్లో ఇదివరకు చాలామంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చెప్పేవాళ్లు, నవతరం కథానాయిక శ్రీలీల మాత్రం డాక్టర్, యాక్టర్ ఈ రెండు వృత్తుల్నీ నాకు నేనుగానే ఎంచుకున్నా అంటోంది. మా ఇంటి వాతావరణం ప్రభావమో ఏమో... పాఠశాల రోజుల్లోనే పెద్దయ్యాక వైద్యురాల్ని కావాలని నాకు నేనుగా నిర్ణయం తీసేసుకున్నా అని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

"ఆ దిశగానే నా చదువులు సాగాయి. ఇక నటన అంటారా? నాకు చిన్నప్పట్నుంచీ నాట్యంలో ఉన్న ప్రవేశం నన్ను వేదికలెక్కించింది. ఆ ప్రతిభే నటనవైపూ తీసుకొచ్చింది. ఈ రెండు వృత్తుల ప్రయాణం వేర్వేరుగా అనిపించినా... రెండు కూడా ప్రజలతో ముడిపడినవే కదా. అందుకే రెండింటిపైనా నాకు ఒక రకమైన ప్రేమ ఉంటుంది" అని చెప్పుకొచ్చింది శ్రీలీల.

రొమాంటిక్ ప్రేమకథలన్నా, పీరియాడిక్ కథలన్నా అమితమైన ప్రేమ అని, వాటిల్లో నటించే అవకాశం వస్తే అస్సలు వదులుకోనని చెప్పింది ఈ కన్నడ అందం.

Tags:    

Similar News