స్టార్ హీరోలకు సంబంధించిన స్పెషల్ డేస్ లో వచ్చే అప్డేట్స్ కూడా స్పెషల్ గానే ఉంటాయి. ముఖ్యంగా వారి బర్త్ డేస్ సందర్భంగా వచ్చేవి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే ఈ నెల 20న ఉంది. ఆ సందర్భంగా అతని రెండు సినిమాల అప్డేట్స్ రాబోతున్నాయి. ఫస్ట్ టైమ్ బాలీవుడ్ డెబ్యూ ఇస్తోన్న వార్ 2 నుంచి ఒక పోస్టర్ కోసం అభిమానులు చాలాకలంగా ఎదురుచూస్తున్నారు. వారి కోరిక ఈ బర్త్ డేతో నెరవేరబోతోంది. ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ఒక పాట బ్యాలన్స్ ఉండిపోయింది. సినిమాను ఆగస్ట్ 14న విడుదల చేయబోతున్నారు. హృతిక్ రోషన్ మరో హీరోగా నటించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ చేస్తోంది. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. సో.. ఈ మూవీ నుంచి ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా ఓ పోస్టర్ విడుదల చేయబోతున్నారని సమాచారం.
ఇక ప్రశాంత్ నీల్ చిత్రం నుంచి ఏకంగా గ్లింప్స్ నే రిలీజ్ చేస్తారట. ఈ గ్లింప్స్ తో యేడాది తరవాత విడుదలయ్యే మూవీకి హైప్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్ గానే ఎన్టీఆర్ ఒక షెడ్యూల్ చిత్రీకరణలో పాల్గొన్నాడు. ఇదో హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా. ఆ పార్ట్ నే చిత్రీకరించారట. అందుకే ఫ్యాన్స్ ఓ రేంజ్ కిక్ ఇచ్చే గ్లింప్స్ విడుదల చేయాలనుకుంటున్నారు. మరోవైపు వార్ 2 నుంచి కూడా గ్లింప్స్ వస్తాయనే టాక్ ఉంది. మొత్తంగా ఫ్యాన్స్ కు ఈ సారి బర్త్ డే సందర్భంగా డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు ఎన్టీఆర్.