Tollywood : నాని సరసన ‘డ్రాగన్’ బ్యూటీ

Update: 2025-05-09 09:45 GMT

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ మూవీలో ‘డ్రాగన్’ మూవీ భామ కయాదు లోహర్ నటించనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పందన రావాల్సి ఉంది. ఇటీవల విడుదలైన డ్రాగన్ మూవీలో కయాదు పేరు మార్మోగింది. కాగా ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారని చర్చ జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ‘టాక్ ఆఫ్ ది టౌన్’గా నిలిచింది. కయాదుతో పాటు 'ప్యారడైజ్' సినిమాలో మరో కథానాయిక కూడా చోటు ఉంటుందని తెలిసింది. ఆమె ఎవరనేది త్వరలో తెలుస్తుంది. ప్రస్తుతం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నటీనటుల ఎంపిక మీద దృష్టి పెట్టారు. కొన్ని నెలలుగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఆల్రెడీ విడుదల చేసిన సినిమా టీజర్ టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Tags:    

Similar News