Reba Monica : డ్రీమ్ టీమ్.. రెబా మోనిక పిక్స్ వైరల్!

Update: 2025-06-24 10:20 GMT

జకబింటే స్వర్గరాజ్యం మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రెబమోనికా జాన్. 'ఫోరెన్సిక్', 'జరుగండి', 'బిగిల్', 'మైఖేల్', 'ఎఫ్ఎఆర్' తదితర హిట్ మూవీల్లోనూ నటించింది. ఓ వైపు హీరోయిన్ గా నటిస్తూనే, మరోవైపు స్పెషల్ రోల్స్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకుందీ అందాల తార. ఇక ‘భూ’, ‘సామజవరగమన' సినిమాలతో టాలీవుడ్ కు పరిచయమైన రెబా.. రీసెంట్ గా 'మ్యాడ్ స్క్వేర్' మూవీలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. స్వాతిరెడ్డి పాటలో దుమ్మురేపే స్టెప్పులేసి తెలుగు ప్రేక్షకులను మైమరిపించింది. ప్రస్తుతం మరోసారి శ్రీ విష్ణు సరసన మృత్యుంజయ్' చిత్రంలో నటిస్తోంది. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది రెబా మోనిక. తరచూ తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేస్తుంటుంది. అయితే కెరీర్ తొలినాళ్లలో ట్రెడిషనల్ మోడ్ లో కనిపించిన ఈ భామ.. ఇప్పుడు కిర్రాక్ లుక్ తో కవ్విస్తుంది. తాజాగా ఈ అమ్మడు బ్లాక్ డ్రెస్సు లో కొంటె చూపులతో ఫోజులు ఇస్తూ కుర్రకారు మనసును దోచేసింది. నల్లటి స్ట్రాప్రెస్ గౌను, మృదువైన అలలు, అందమైన కండ్లు రెబా లుక్ను మరింత అద్భుతంగా మార్చాయి. ఈ ఫిక్స్ కు 'డ్రీమ్ టీమ్’ అంటూ క్యాప్షన్ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ గా మారాయి.

Tags:    

Similar News