Mrunal Thakur : ముద్దు సీన్ల వలన పెద్ద సినిమా వదులుకున్నా : మృణాల్ ఠాకూర్

Update: 2024-05-02 05:40 GMT

సీతారామం సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్.. ఆ తర్వాత చాలా సినిమాలే చేసింది. ఈ మధ్యే 'ఫ్యామిలీ స్టార్' మూవీతో మరోమారు పలకరించింది. తెలుగులో చేసిన గత రెండు చిత్రాలతో పోలిస్తే.. ఇందులో ఆమె కొంచెం గ్లామర్ డోస్ పెంచింది. సినిమా చివర్లో పెదవి ముద్దులు కూడా ఉన్నాయి. బాలీవుడ్ లో చేసిన వేరే చిత్రాలు కొన్నింట్లో కొంచెం ఘాటుగా కూడా నటించింది.

కెరీర్ ఆరంభంలో మాత్రం చిన్న ముద్దు సీన్ అంటే భయపడి పోయేదాన్ని అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది మృణాల్. కేవలం కిస్, ఇంటిమేట్ సీన్లు ఉన్నాయని పెద్ద సినిమాలు కూడా వదులుకున్నానని అంటోంది. ఏదైనా కథ చెప్పినపుడు ముద్దు సీన్లు ఉన్నాయని అనగానే తన తల్లిదండ్రులు గుర్తుకు వచ్చేవారని, అవి చూస్తే వాళ్లు ఏమనుకుంటారో అనే భయంతో నో చెప్పేదాన్నంటోంది మృణాల్.

ముద్దు సీన్లు, ఇంటిమేట్ సీన్లు కూడా కథలో భాగమే అని అర్థం చేసుకున్నాక తల్లిదండ్రులకు నచ్చ చెప్పానంటోంది. కెరీర్ ఆరంభంలో ఒక భారీ ప్రాజెక్టును ఇంటిమేట్ సీన్లు చేయలేకే వదులుకున్నపుడు బాధపడ్డానని చెబుతోంది మృణాల్. తెలుగులో సీతారామం లాంటి అందమైన ప్రేమకథలో ఎంతో పద్ధతిగా కనిపించాక మృణాల్ నుంచి ప్రేక్షకులు ముద్దు సన్నివేశాలు, ఇంటిమేట్ సీన్లు పెద్దగా ఆశించట్లేదు.

Tags:    

Similar News