Dulquer Salman : టాలీవుడ్ పైనే ఫోకస్ పెడుతున్న మల్లూ సూపర్ స్టార్

Update: 2024-07-19 05:32 GMT

 మలయాళ సినీ ఇండస్డ్రీస్ లో తిరుగులేని స్టార్ దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా రేంజ్ లో అతడు అందరికీ సుపరిచితుడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కొన్ని వెరైటీ సినిమాలు చేసిన అరుదైన హీరో. అలాంటి ఈ యంగ్ స్టార్ .. టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో మరింతగా పాపులర్ అయ్యాడు. దుల్కర్ సల్మాన్ ఇక్కడ తన మార్కెట్‌ను విస్తరించుకోవడానికి విపరీతంగా కృషి చేస్తున్నాడు.

తెలుగు దర్శకనిర్మాతలు కూడా తమ సినిమాల కోసం దుల్కర్ ను ఎంపిక చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం దుల్కర్ "లక్కీ బాస్కర్" (Lucky Bhaskar) అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది సెప్టెంబర్‌లో విడుదల కానుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాగ వంశీ నిర్మిస్తున్నారు.

ఆ తర్వాత రానా దగ్గుబాటి సహ నిర్మాతగా, తెలుగు-మలయాళం ద్విభాషా చిత్రం “కాంత” లో నటిస్తున్నాడు . అలాగే వైజయంతి మూవీస్‌తో మరో పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌కు సంతకం చేశాడు. మొత్తానికి అతని చేతిలో ఇప్పుడు మూడు తెలుగు సినిమాలున్నాయి.

పాన్-ఇండియన్ ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశాలతో తెలుగు చిత్రనిర్మాతలు తనకు ఆఫర్ చేస్తున్నందుకు దుల్కర్ సల్మాన్ కూడా సంతోషిస్తున్నాడు. అంతేకాదు.. అతను మలయాళ చిత్ర పరిశ్రమలో అందుకొనే పారితోషికం కన్నా .. చాలా ఎక్కువ ఇక్కడ అతను డిమాండ్ చేస్తున్నాడు. అతని టాలెంట్ అంతటి వర్త్ చేస్తుంది కాబట్టి.. తెలుగు నిర్మాతలు కూడా ఆ అమౌంట్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారు. మొత్తం మీద దుల్కర్ సల్మాన్ .. తెలుగు హీరోగా గుర్తింపు పొందేందుకు తన ప్రయత్నం తాను చేస్తున్నాడు.

Tags:    

Similar News