ED Action : బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ దూకుడు.. విజయ్ దేవరకొండకు మళ్లీ నోటీసులు..!

Update: 2025-07-24 09:15 GMT

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో మరోసారి కీలక పరిణామం చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్ ల మోజులో పడి పలువురు యువకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీస్ శాఖ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసే వారిపై తీవ్ర స్థాయిలో మండిపడింది. పలువురు సెలెబ్రిటీలపై కేసులు కూడా నమోదు చేసింది. తాజాగా ఈ వ్యవహరంలోకి ఈడీ ఎంటర్ అయింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో పాల్గొన్న పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చింది.

ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురు సెలెబ్రిటీలను విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు ఈడీ అధికారులు. ఈనెల 23న దగ్గుబాటి రానా, 30న ప్రకాష్ రాజ్, ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, ఆగస్టు 13న మంచు లక్ష్మి విచారణకు హాజరు కావాలని ఈడీ తన నోటీసులో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఐతే ఇప్పటికే ఒకసారి విచారణకు హాజరయ్యారు నటుడు విజయ్ దేవరకొండ. అయినప్పటికీ మళ్ళీ విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇక నిన్న విచారణకు రావాల్సిన హీరో రానా సైతం తనకు కొంత సమయం కావాలని అధికారులను కోరారు. ఈ క్రమంలో రానా కు కూడా మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది.

Tags:    

Similar News