Bollywood Film : బాద్ కోసం షీరాన్ పాట

Update: 2025-06-21 13:45 GMT

బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ ను ఆకాశానికెత్తాడు బ్రిటీష్ గాయకుడు, గేయ రచయిత ఎడ్ షీరాన్. ఆయన ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ వ్యక్తి అంటూ కొనియాడాడు. షారుఖ్ ఖాన్ చిత్రం కోసం హిందీ ట్రాక్ను తాను రికార్డ్ చేసినట్లు ధృ వీకరించాడు. ప్రస్తుతానికి షారూక్ సినిమాకి కింగ్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుంచి చాలా విషయాలు రహస్యం గానే ఉన్నాయి. నిజానికి షీరాన్ ఓ పంజాబీ పాటను చేస్తు న్నాడని ప్రచారం సాగింది. కానీ ఆయనే స్వయంగా ఈ గందరగోళాన్ని తొలగించాడు. 'ఈ పాట షారుఖ్ ఖాన్ చేస్తున్న బాలీవుడ్ సినిమా కోసం. ఇది అరిజిత్తో కలిసి సఫైర్కి పంజాబీ వెర్షన్. నేను ఈ సమయంలో అన్ని భాషలలో పని చేస్తున్నాను' అని ఆయన రాశాడు. దీంతో కింగ్ షారూక్ ఖాన్ సినిమా కోసం షీరాన్ పాడుతున్నా రని క్లారిటీ వచ్చింది. సఫైర్ గీతంలో షారూక్, అరిజీత్ కూడా ఉన్నారు.

Tags:    

Similar News