'Abir Gulal' Banned : పహెల్గాం దాడుల ఎఫెక్ట్ .. 'అబీర్ గులాల్' బ్యాన్

Update: 2025-04-25 09:45 GMT

పహెల్గాం దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన అబీర్ గులాల్ సినిమా భారతదేశంలో విడుదల కావడం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నిన్న దౌత్యపరమైన కోతలో భాగంగా, భారతదేశం పాకిస్తాన్పై అనేక చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. సింధు జల ఒప్పందం, సార్క్ వీసాలు నిలిపివేతతోపాటు, వాఘా బార్డర్ మూసి వేత తదితరులు ఉన్నాయి. అయితే తాజాగా ఈ ప్రభావం సినిమాల మీదా పడింది. ఈ సినిమాలో వాణికపూర్ హీరోయిన్ గా నటించింది. మే 9న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ 9 ఏండ్ల తర్వాత మళ్లీ బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఇందులో పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటిస్తుండడంతో మూవీని కేంద్రప్రభుత్వం బ్యాన్ చేసింది. పాకిస్థానికి చెందిన నటులపై భారత్లో నిషేధం విధించబోతున్నట్లు సమాచారం. ఇటీవలే ఈ మూవీ నుంచి రెండు పాటలను చిత్రయూనిట్ విడుదల చేయగా.. తాజాగా వాటిని యూట్యూబ్ ఇండియా నుంచి మేకర్స్ తొలగించారు.

Tags:    

Similar News