మహానటి, ‘కల్కి' డైరెక్టర్ నాగ్ అశ్విన్ తొలి చిత్రం 'ఎవడే సుబ్రమణ్యం'. సినిమా వచ్చి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మార్చి 21న రీ రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ పేర్కొంది. 'దశాబ్దం తర్వాత దూధ్ కాశీ మిమ్మల్ని మళ్లీ పిలుస్తోంది. పెద్ద తెరపై ఎవడే సుబ్రహ్మణ్యం మాయాజాలాన్ని తిరిగి ఆస్వాదించండి' అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. నేచురల్ స్టార్నాని, రౌడీబాయ్ విజయ్ దేవరకొండ, మాళవికా నాయర్, రీతూ వర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. ఈ సినిమాలో అద్భుతమైన నటనతో వారి ఉనికిని చాటుకున్నారు. మరోవైపు ఈమూవీకి సంగీత దర్శకుడు రాధన్ అందించిన సౌండ్ట్రాక్ హైలైట్గా నిలిచింది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్నదత్, ప్రియాంక దత్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించారు.