Hari Hara Veera Mallu Teaser : పవన్ ఫ్యాన్స్‌కు ఖుషీ ఖబర్.. హరిహర వీరమల్లు టీజర్ వస్తోంది
పవన్ కళ్యాణ్ వారియర్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ 'హరిహర వీరమల్లు'. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఏఎం రత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆల్రెడీ 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. పవన్ రాజకీయాలు, ఎన్నికల వల్ల షూటింగ్ లేటవుతోంది.
బుధవారం శ్రీరామనవమి సందర్భంగా మూవీ నుంచి టీజర్ అప్డేట్ ని ఇచ్చారు. త్వరలో టీజర్ మీ ముందుకు రాబోతుంది అంటూ క్లారిటీ ఇచ్చారు. టీజర్ తో మూవీపై వస్తున్న అనుమానాలు పటాపంచలు అవుతాయని ఫ్యాన్స్ టాక్.
ఈ ఏడాది లోపే హరిహర వీరమల్లు థియేటర్లోకి రావొచ్చని చెబుతున్నారు. మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్. యానిమల్ తో తెలుగువారిని ఆకట్టుకున్న బాబీ డియోల్, బాహుబలి డ్యాన్సర్ నోరా ఫతేహి కీలక పాత్రల్లో కనిపిస్తారు. కీరవాణి సమకూర్చిన బాణీలు త్వరలోనే రిలీజ్ కానున్నాయి. OG, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా రిలీజ్ కు రెడీ కావడంతో.. వచ్చే 6 నెలల్లో పవన్ ఫ్యాన్స్ కు భారీ సినిమా పండుగ గ్యారంటీ.