మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా రాజాసాబ్. ఈ హారర్ కామెడీ జానర్ చిత్రం పై మొదటి నుంచి భారీ అంచనాలు నెల కొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పోస్టర్లు సినిమాపై హైప్ పెంచేశాయి. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. ఆ పాట కోసం పలు టాప్ హీరోయిన్లను చిత్ర యూనిట్ పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, చివరకు తమన్నాని ఫైనల్ చేశారని వార్తలు వస్తున్నాయి. తమన్నా ప్రస్తుతం స్పెషల్ సాంగ్కి హాట్ ఫేవరెట్. ఆమెకి ఉన్న డ్యాన్స్ టాలెంట్, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాటను హైలైట్గా నిలిపేలా చేస్తాయని భావిస్తున్నారు. తమన్నా ఎంట్రీ కన్ఫర్మ్ అన్న సంకేతాలే కనిపిస్తున్నాయి. ఈ సమాచారం నిజమైతే 'ది రాజా సాబ్' లో వచ్చే ఈ స్పెషల్ సాంగ్ సినిమాకు అదనపు అట్రాక్షన్ కానుంది. ప్పటికే 'రెబల్', 'బాహుబలి 1' 'బాహుబలి 2' సిని మాల్లో మిల్కీబ్యూటీ ప్రభాస్ డార్లింగ్ ఇద్దరూ కలిసి పనిచేశారు. రాజాసాబ్ లో వీరిద్దరూ కలిసి మరో మారు కనువిందు చేస్తారన్నమాట. తమన్నా గత కొంత కాలం నుంచి హీరోయిన్ గా చేస్తూనే స్పెషల్ సాంగ్స్ లోను తన సత్తా చాటుతుంది. పైగా సదరు సాంగ్ వలన ఆయా చిత్రాలకి స్పెషల్ క్రేజ్ కూడా వస్తుంది. 'జైలర్' లోని నువ్వు కావాలయ్యా సాంగ్, గత ఏడాది ఆగస్టులో వచ్చిన 'స్త్రీ 2 ' లోని ఆజ్ కీ రాత్ సాంగ్ లే అందుకు ఉదాహరణ.