Ezra Miller: తాగి బార్‌లో రచ్చ చేసిన యంగ్ హీరో.. సింగర్‌తో అసభ్య ప్రవర్తన..
Ezra Miller: ఆ సింగర్ ఎజ్రాకు సహకరించకపోడంతో తన చేతుల్లోని మైక్రోఫోన్ తీసుకొని అక్కడ నుండి వెళ్లిపోయాడు.;
Ezra Miller (tv5news.in)
Ezra Miller: తాగితే విచక్షణ కోల్పోతారు కొందరు. ఆ సమయంలో వారు ఎవరనేది మర్చిపోయి వేరుగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా అలా తాగి ఓ సింగర్‌ను లైంగికంగా దాడిచేసినందుకు ఓ యంగ్ హీరో కెరీర్‌కు బ్లాక్ మార్క్ పడింది. ప్రస్తుతం అంతటా ఇదే హాట్ టాపిక్‌గా నడుస్తోంది.
పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి పాపులర్ అయిన హాలీవుడ్ యంగ్ హీరో ఎజ్రా మిల్లర్. 2008లో హీరోగా మొదలయిన ఎజ్రా ప్రస్థానం ఇప్పటికీ నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. కచ్చితంగా ఏడాదికి ఒక్క సినిమా అయినా విడుదల చేసి తన ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తాడు ఎజ్రా. అలాంటి ఎజ్రా క్షణికావేశం వల్ల తన కెరీర్‌నే రిస్క్‌లో పడేసుకున్నాడు.
హవాయిలోని ఓ బార్‌లో జరిగిన పార్టీలో ఎజ్రా మిల్లర్ పాల్గొన్నాడు. అక్కడ మద్యం సేవించిన తర్వాత.. స్టేజ్‌పై పాడుతున్న సింగర్‌తో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. స్టే్జ్ ఎక్కి తనపై చేతులు వేస్తూ లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. ఆపడానికి వచ్చిన మేనేజర్‌ను కూడా దాడి చేశాడు.
అయితే ఆ సింగర్ ఎజ్రాకు సహకరించకపోడంతో తన చేతుల్లోని మైక్రోఫోన్ తీసుకొని అక్కడ నుండి వెళ్లిపోయాడు. దీంతో బార్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎజ్రాను అదుపులోకి తీసుకొని 500 డాలర్లు జరిమానా విధించారు. ప్రస్తుతం అతడికి బెయిల్ కూడా మంజూరు అయ్యింది.