RRR: తొక్కుకుంటూ పోవాలె.. కెనడాలో 'ఆర్ఆర్ఆర్' ఫ్యాన్స్ రచ్చ..
RRR: ఆర్ఆర్ఆర్ మానియా అంతర్జాలంలో ఓ ఊపు ఊపుతుంది.;
RRR: ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటిస్తే.. డైరెక్టర్ రాజమౌళి అయితే.. ఎక్కడ తగ్గాలి.. ఎందుకు తగ్గాలి.. ఎప్పుడు వస్తుందో ఎదురు చూడలేక పోతున్నారు ఫ్యాన్స్.. ఊరిస్తూ, పోస్ట్ పోన్ అవుతూ ఎట్టకేలకు మార్చి 25కి డేట్ ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్.. ఆర్ఆర్ఆర్ మానియా అంతర్జాలంలో ఓ ఊపు ఊపుతుంది.
మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ RRR. టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఫిక్షన్ పీరియాడికల్ మూవీ ఇది. బాహుబలితో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన దర్శకధీరుడు రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కోసం యావత్ భారతదేశంతో పాటు ప్రపంచంలోని సినీ ప్రేమికులందరూ RRR కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రం మార్చి 25న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఒకవైపు మెగా అభిమానులు, మరోవైపు నందమూరి అభిమానులు ఈ సినిమా కోసం ఇప్పటినుంచే సందడి చేయడం మొదలుపెట్టారు. ముందస్తు బుకింగ్‌లకు రంగం సిద్ధమైంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది ఫ్యాన్స్ చేస్తున్న హడావిడి చూసి మేకర్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు.
తాజాగా కెనడాలోని ఎన్టీఆర్ అభిమానులు ఆర్ఆర్ఆర్ అక్షరాలతో కార్లను డిజైన్ చేశారు. ఎన్టీఆర్ పై అభిమానంతో ఆయన పేరును కూడా కార్లతో డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసి మేకర్స్ తో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
400 కోట్లకు పైగా ఖర్చు చేసిన ఈ భారీ బడ్జెట్ చిత్రం RRRలో రామ్ చరణ్, ఎన్టీఆర్, బాలీవుడ్ తారలు అలియా భట్, అజయ్ దేవగన్, హాలీవుడ్ నటులు ఒలివియా మోరిస్, అల్లిసన్ డూడీ, రే స్టీవెన్సన్ వంటి భారీ తారాగణంతో రూపొందించారు.
చరిత్రలో ఎన్నడూ చూడని ఇద్దరు యోధులు స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందనే కథాంశంతో 1920 బ్యాక్‌డ్రాప్‌లో రాజమౌళి RRRని రూపొందించారు. DVV దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు.
#RRRMassBegins … 🔥🌊🤞🏻
— RRR Movie (@RRRMovie) March 12, 2022
Canada fans, thanks for your love and unmatchable efforts to make this !! ❤️ #RRRMovie
pic.twitter.com/0haQVYMPjA