Akkineni Akhil : కరెక్ట్ ట్రాక్ లోకి వచ్చిన అక్కినేని అఖిల్

Update: 2025-04-07 07:00 GMT

కరెక్ట్ ట్రాక్ లోకి వచ్చిన అక్కినేని అఖిల్అక్కినేని అఖిల్.. ఆరంభం నుంచీ తడబడుతూనే ఉన్నాడు. ఇప్పటి వరకూ తమ లెగసీకి తగ్గట్టుగా సాలిడ్ విజయాన్ని కూడా అందుకోలేకపోయాడు. హ్యాండ్సమ్ హీరో అనిపించుకున్నా అందుకు తగ్గ కథలు పడటం లేదు. హీరోగా ఇప్పటి వరకూ చేసిన అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఏజెంట్ ఏదీ పెద్ద హిట్ కాదు. ఉన్నంతలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మాత్రం కమర్షయల్ గా ఓకే అనిపించుకుంది.

ప్రస్తుతం వరుస సినిమాలతో వస్తున్నాడు. వీటిలో లెనిన్ ముందుగా వస్తుంది. దీని తర్వాత సితార, అన్నపూర్ణ, మనం ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమా ప్రారంభం కాబోతోంది. కిరణ్ అబ్బవరంతో వినరో భాగ్యము విష్ణుకథ అనే చిత్రంతో ఆకట్టుకున్న నందకిశోర్ అబ్బూరు డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ను ఈ మంగళవారం విడుదల చేయబోతున్నాం అని ప్రకటించింది టీమ్. దీంతో పాటు విడుదల చేసిన పోస్టర్ చూస్తే అఖిల్ సరైన ట్రాక్ లోకి వచ్చాడు అనిపిస్తుంది.

అఖిల్ మాస్ లుక్ తో కనిపించబోతున్నాడు అని అర్థం అయింది. అలాగే ఈ కేవలం చేతులు మాత్రమే కనిపిస్తోన్న ఈ పోస్టర్ లో ఎడమచేతికి ప్రత్యేకమైన సింబల్ ఉన్న కడియం ఉంది. దీంతో పాటు ‘నో వార్ ఈజ్ మోర్ వయొలెంట్ దన్ లవ్’ అనే క్యాప్షన్ కనిపిస్తోంది. ఈ క్యాప్షన్ ను బట్టే అఖిల్ ట్రాక్ లో ఉన్నాడని చెప్పేది. అతని కటౌట్ కు ఇలాంటి లవ్ స్టోరీస్ బాగా సెట అవుతాయి. ఆ స్టోరీస్ లో కాస్త మాస్ ఉన్నా ఫర్వాలేదు. కేవలం మాస్ ను మెప్పించాలనే తాపత్రయంలో కథలు విడిచి సాము చేయడం కంటే.. తన లుక్ కు సరిపోయేలా మంచి ప్రేమకథలు సెలెక్ట్ చేసుకుని అందులో మాస్ కంటెంట్ ఉండేలా చూసుకుంటే బెటర్. ఏదేమైనా లెనిన్ తో పాటు ఈ చిత్రం అఖిల్ కెరీర్ ను సెటిల్ చేస్తాయనే కాన్ఫిడెంట్ అందరిలో కనిపిస్తోంది.

 

Tags:    

Similar News