టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్‌కు సీరియస్ గా ఉంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు వైద్యులు.2 కిడ్నీలు పాడవ్వడంతో వారం రోజులుగా వెంటిలేటర్‌పైనే ట్రీట్‌మెంట్ జరుగుతోంది. ఆర్థిక సాయం కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. ఫిష్ వెంకట్‌ను టాలీవుడ్ ఆదుకోవాలంటూ కుటుంబ సభ్యుల విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో స్టార్ హీరోల సినిమాల్లో పనిచేసిన ఫిష్ వెంకట్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఫిష్ వెంకట్ అసలు పేరు మంగిలంపల్లి వెంకటేశ్. హైదరాబాద్లో పుట్టి పెరిగాడు. ఈయన కేవలం 3వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. మొదట్లో ముషీరాబాద్‌లోని కూరగాయల మార్కెట్‌లో చేపలు అమ్ముకునే వ్యాపారం చేసేవాడు. దానితో అందరూ ఫిష్ వెంకట్ అని పిలిచేవారు. వెంకట్ ను సినీ పరిశ్రమకు తన మిత్రుడైన శ్రీహరి ద్వారా వచ్చాడు. దర్శకుడు వి.వి.వినాయక్ ఇతడిని తెలుగు చిత్రసీమకు పరిచయం చేశాడు. వెంకట్ వి.వి.వినాయక్ సినీ పరిశ్రమలో తన గురువుగా భావిస్తాడు. వెంకట్ ఎక్కువగా తెలంగాణా మాండలికము మాట్లాడే హాస్య, దుష్ట పాత్రలు పోషించాడు. ఆది సినిమా ద్వారా ప్రజాధరణ పొందిన వెంకట్ సుమారు ఇప్పటివరకు 90 సినిమాల్లో నటించాడు.