Game Changer OTT : గేమ్ ఛేంజర్’ ఓటీటీ విడుదల ఫిక్స్?

Update: 2025-01-24 06:15 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవగా 5 వారాలు పూర్తయ్యాక ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 14వ తేదీన స్ట్రీమింగ్‌కు వస్తుందని అంచనా వేశాయి. ఈ చిత్ర ఓటీటీ హక్కులను ‘అమెజాన్ ప్రైమ్’ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అంటే థియేటర్లలో రిలీజ్ అయిన 35 రోజుల తర్వాత ‘గేమ్ ఛేంజర్’ ఓటీటీలోకి అందుబాటులోకి రానుందన్న మాట.త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఇక ఈ సినిమా రూ.220 కోట్లకు ప్రీరిలీజ్ చేసింది.అయితే,బ్రేక్ ఈవెను కోసం మరో రూ.222 కోట్లు రాబట్టాల్సి ఉంది. ఈ 11 రోజులు వ్యవధిలో రూ.127.15 కోట్ల షేర్ వచ్చినట్టు తెలుస్తోంది. బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే మరో రూ.130 కోట్లకి పైగా షేర్ ను రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం.

Tags:    

Similar News