Vijay Devarakonda : రౌడీ జనార్థన్ రెడీ అవుతున్నాడా..?

Update: 2025-12-17 11:53 GMT

విజయ్ దేవరకొండ మూవీస్ విషయంలో ఈ మధ్య తప్పులు చేస్తున్నాడు. వైవిధ్యమైన ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఆ మేరకు విజయాలేం రావడం లేదు. అనుకున్న స్థాయిలో సక్సెస్ రావడం లేదు. కింగ్ డమ్ విషయంలో చాలా నమ్మకంతో ఉన్నాడు. బట్ అదీ పోయింది. అయితేనేం అతను చేస్తోన్న మూవీస్ మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలో వస్తోన్న సినిమాలు మాత్రం ఈ సారి అతని నమ్మకాన్ని నిలబెడతాయి అనిపించేలా ఉంది. అందులో భాగంగా వస్తోన్న మూవీ రౌడీ జనార్థన్.

దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తోన్న మూవీ రౌడీ జనార్థన్. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీపై చాలా హోప్స్ తో పెట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. ఫస్ట్ టైమ్ తిరుపతి స్లాంగ్ లో మాట్లాడబోతున్నాడు అని కూడా తెలుస్తోంది. అయితే ఈ మూవీ టీజర్ కు టైమ్ వచ్చింది. అసలు ఈ మూవీ ఎప్పుడు షూటింగ్ చేస్తున్నారు అనే విషయంలో క్లారిటీ లేకపోయినా .. అతని మూవీ టీజర్ తో రెడీ కావడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఈ నెల 22న ఈ మూవీ గ్లింప్స్/ టీజర్ మాత్రం విడుదల చేయబోతున్నారట. అంటే ఆ టైమ్ కు మంచి టీజర్ తో మూవీ టీమ్ సిద్ధం అవుతోంది. రవి కిరణ్ కోలా డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది. మరి ఈ మూవీతో అయినా విజయ్ దేవరకొండ సాలిడ్ బ్లాక్ బస్టర్ కొడతాడా అనేది మాత్రం చూడాలి. 

Tags:    

Similar News