Gangs Of Godavari : గోదారోళ్ల సరసం 'సుట్టంలా సూసి'
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఫస్ట్ సింగిల్ పై క్రేజీ అప్ డేట్;
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. కృష్ణ చైతన్య దర్శకత్వ వహిస్తోన్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ పై మేకర్స్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. 'సుట్టంలా సూసి' అనే ఫస్ట్ సింగిల్ రొమాంటిక్ సాంగ్ ను ఆగస్టు 16న రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ‘గోదావరి రొమాంటిక్ జలాల్లో తడిసి ముద్దయ్యే సమయం ఇది’ అంటూ క్యాప్షన్ కూడా ఈ పోస్టుకు జోడించారు. దాంతో పాటు ఓ కొత్త పోస్టర్‌ను కూడా చిత్రబృందం విడుదల చేసింది.
ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన 'డీజే టిల్లు' ఫేం నేహాశెట్టి ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. కాగా ఇక ఈ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు, గ్లింప్స్ వీడియో మూవీపై క్యూరియాసిటీని పెంచాయి. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తుండగా.. డిసెంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు.
పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీ విశ్వక్ సేన్ 11వ సినిమాగా రాబోతోంది. ఇటీవల 'దాస్ కా ధమ్కీ' సినిమాతో హిట్ కొట్టి ఫామ్ లో ఉన్న ఆయన... ప్రస్తుతం మరో మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజైన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' గ్లింప్స్ ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. మేము గోదారోళ్ళం.. మాటొకటే సాగదీస్తాం, తేడా వస్తే.. నవ్వుతూ నరాలు తీసేస్తాం అంటూ విశ్వక్‌సేన్ మాస్ డైలాగ్ ప్రేక్షకులను విశేషంగా అట్రాక్ట్ చేసింది.