తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న బ్యూటీ పూజా హెగ్దే. అయితే ఈముద్దుగుమ్మ టాలీవుడ్ లో ఎక్కువగా కనిపించడం లేదు. తెలుగులో ఈ బుట్టబొమ్మ చివరగా రాధేశ్యామ్ సినిమాలో హీరోయిన్గా నటించింది. అదే ఏడాది ఆచార్య, ఎఫ్ 3 సినిమాల్లో ముఖ్యపాత్రల్లో, ఐటెం సాంగ్ లో కనిపించింది. దాదాపు రెండేళ్లు పెద్దగా ఆఫర్లు లేకుండానే కెరీర్ ను నెట్టుకు వచ్చిన పూజా చేతిలో ప్రస్తుతం అర డజను మూవీలు ఉన్నాయి. కానీ అవన్నీ తమిళ్ హిందీ సినిమాలు కావడం విశేషం. అయితే ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్ద కాలం దాటినా కూడా అందం విషయంలో ఏమాత్రం తగ్గట్లేదు పూజా. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తాజాగా ఈ డార్క్ షేడ్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. చీకటిలో లైట్ వెలుతురులో ఈభామ అందంగా కనిపిస్తోంది. కవ్వించే విధంగా చూస్తున్న పూజా హెగ్దే పిక్స్ మరోసారి వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఈ అమ్మడు వచ్చే ఏడాదిలో అయినా టాలీవుడ్ సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.