అజిత్ కుమార్ హీరోగా యంగ్ డైరెక్టర్ ఆధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన యాక్షన్, కామెడీ థ్రిల్లర్ చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కేవలం 10 రోజుల్లోనే రూ. 200 కోట్ల మార్క్ ను అందుకుంది. విశ్వాసం సినిమా తర్వాత గుడ్ బ్యాడ్ అగ్లీతో అజిత్ రెండోసారి రూ. 200 కోట్ల మార్క్ ను అందుకున్నాడు. థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నెట్ ఫ్లిక్స్ వేదికగా మే 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కాగా.. ఈ సినిమాలో అజిత్ గ్యాంగ్ స్టర్ పాత్రలో మెప్పించాడు. గుడ్ బ్యాడ్ అగ్లీలో త్రిష హీరోయిన్గా నటించగా.. అర్జున్ దాస్ విల న్ పాత్రలో అలరించారు. టాలీవుడ్ నటుడు సునీల్, కార్తికేయ దేవ్, ప్రియా ప్రకాష్ వారియర్, ప్రభు, ప్రసన్న, టిన్ను ఆనంద్, రఘు రామ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించాడు.