Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆఖరి అధ్యాయం మొదలు

Update: 2024-11-30 13:45 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలియని వారుండరు. అయితే... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ఒక వారియర్ గా కనిపిస్తూ చేస్తున్న సినిమా 'హరి హర వీరమల్లు'. ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీని క్రిష్ డైరెక్ట్ చేస్తున్నారు. సగభాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం.. పవన్ పొలిటికల్ గా బిజీగా ఉండటం వల్ల లేట్ అవుతూ వచ్చింది. దీంతో ఈ మూవీ రిలీజ్ డేట్, ఇతర అప్డేట్స్ పై కూడా ఎటువంటి సమాచారం లేకుండా పోయింది. అయితే.. ఇలాంటి తరుణంలోనే.. 'హరి హర వీరమల్లు' నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఇవాల్టి నుంచి షూటింగ్ లో పాల్గొననున్నారట పవన్ కళ్యాణ్. ఈ మేరకు చిత్ర బృందం ప్రకటన చేసింది. ధర్మం కోసం పోరాటంలో ఆఖరి అధ్యాయం మొదలు అంటూ ఓ పోస్టర్ కూడా విడుదల చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా ఈ సినిమా 28th మార్చ్ 2025న రిలీజ్ కానుంది.

Tags:    

Similar News