Gorre Puranam : ఓటీటీ లో వచ్చేస్తున్న సుహాస్ ‘గొర్రె పురాణం‘

Update: 2024-10-08 08:58 GMT

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వైవిధ్యభరిత కథలను ఎంచుకుంటూ హీరోగా ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు సుహాస్. కమెడియన్‌గా ప్రస్థానం ప్రారంభించి, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, హీరోగా విభిన్న పాత్రలతో దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాది సుహాస్ నుంచి 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు, శ్రీరంగ నీతులు, ప్రసన్నవదనం' వంటి సినిమాలతో పాటు.. గత నెలలో ‘గొర్రె పురాణం‘ కూడా విడుదలైంది.

సెప్టెంబర్ చివరిలో థియేటర్లలోకి వచ్చిన ‘గొర్రె పురాణం‘ అప్పుడే ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది. అక్టోబర్ 10 నుంచి ఆహా వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. ఒక గ్రామంలో రెండు మతాల మధ్య ఒక గొర్రె వల్ల మొదలైన గొడవలను నేపథ్యంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ గొడవలు కోర్టు వరకు ఎలా వెళ్లాయి? చివరకు ఏమైంది అనేదే ఈ సినిమా కథ. మరోవైపు.. దసరా కానుకగా సుహాస్ నటించిన మరో చిత్రం ‘జనక అయితే గనక‘ అక్టోబర్ 12న థియేటర్లలో విడుదలవుతుంది.

Tags:    

Similar News