నటి హన్సిక మోత్వాని తన సోషల్ మీడియా ఖాతాల నుండి తన పెళ్లి ఫోటోలు, వీడియోలను తొలగించడంతో ఆమె వైవాహిక జీవితంపై అనేక పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ చర్య ఆమె అభిమానులను మరియు మీడియాను ఆందోళనకు గురిచేసింది. హన్సిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో భర్త సోహైల్ కతూరియాతో కలిసి ఉన్న పెళ్లి ఫోటోలు, వీడియోలు, అలాగే వారి ప్రేమాయణం గురించి పోస్ట్ చేసిన ఫోటోలు చాలా వరకు డిలీట్ చేసింది. ఈ చర్యతో హన్సిక, సోహైల్‌లు విడిపోతున్నారని, విడాకుల దిశగా అడుగులు వేస్తున్నారని అనేక వార్తా కథనాలు, సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. పుకార్లపై సోహైల్ కతూరియా ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇది కూడా పుకార్లకు మరింత బలం చేకూరుస్తోంది.గతంలో కూడా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వచ్చినప్పుడు, సోహైల్ వాటిని ఖండించారు. అయితే, ఇటీవల హన్సిక ఫోటోలు తొలగించిన తర్వాత ఆయన స్పందించలేదు. హన్సిక ప్రస్తుతానికి తన తల్లితో కలిసి నివసిస్తున్నారని, సోహైల్ తన వ్యాపార వ్యవహారాలను చూసుకుంటూ ముంబైలో ఉంటున్నారని సమాచారం.