Hanu Raghavapudi : ప్రభాస్ మూవీతో ప్యాన్ ఇండియా డైరెక్టర్ అవుతాడా

Update: 2025-04-19 05:15 GMT

హను రాఘవపూడి.. ఫస్ట్ మూవీతోనే ప్రేమకవిత చెప్పాడు. అందాల రాక్షసి అంటూ అప్పటి వరకూ ఎవరూ చెప్పని విధంగా ట్రైయాంగిల్ లవ్ స్టోరీని ప్రెజెంట్ చేశాడు. ఈ మూవీతోనే నవీన్ చంద్ర, రాహుల్ రామకృష్ణ వెలుగులోకి వస్తే.. లావణ్య త్రిపాఠి హీరోయిన్ పరిచయమై ఇప్పుడు మెగా కోడలుగా మారింది.ఆ తర్వాత చేసిన కృష్ణగాడి వీర ప్రేమగాథ మరో ఎపిక్.ఈ మూవీతో మెహ్రీన్ ను హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఈ రెండు సినిమాల కమర్షియల్ రేంజ్ మేటర్ అలా ఉంచితే ఓ ప్రేమకథను కొత్త కోణంలో చెప్పడంలో ఓ అద్భుతమైన సెన్సిబులిటీస్ ను చూపించడంలో హను రాఘవపూడి తెలుగు సినిమాపై తనదైన సంతకం పెట్టాడు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. తర్వాత చేసిన లై, పడిపడి లేచె మనసు నిరాశపరిచాయి. కానీ అతని మార్క్ సెన్సిబిలిటీస్ ను చూపించాయి. బట్ సీతారామం ఓ ఎపిక్ గా నిలిచింది. తెలుగు తెరపై చాలా యేళ్ల తర్వాత వచ్చిన ప్రేమకావ్యం అన్నారీ చిత్రాన్ని. ఇలాంటి సినిమాను తెలుగు సినిమా అంతకు ముందెప్పుడూ చూడలేదు.ఒకే కథలో యుద్ధం, ప్రేమ, త్యాగం, మతాంతరం, ఎదురుచూపులు.. ఇన్నేసి ఎమోషన్స్ ను పీక్స్ లో పండించిన సినిమా లేదు అనే చెప్పాలి.ఇప్పుడు ఇదంతాఎందుకు అనుకుంటున్నారా.. ఇవాళ ఈ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ బర్త్ డే.

సీతారామం ప్రభావంతోనే ప్రభాస్ అతనికి అవకాశం ఇచ్చాడు. త్వరలోనే ప్రభాస్ తో ఫౌజీ అనే చిత్రంతో రాబోతున్నాడు. ఈ మూవీతోనూ ఇమాన్వీ అనే కొత్త బ్యూటీని పరిచయం చేస్తున్నాడు. ఇదీ రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగే కథ అంటున్నారు.సినిమా పరిశ్రమలోకి ఎంతోమంది దర్శకులు వస్తుంటారు. కానీ వచ్చినవాళ్లంతా వాళ్ల ముద్రను వేయడానికి ఏళ్ల తరబడి టైమ్ తీసుకుంటారు.కానీ ఫస్ట్ మూవీతోనే ఆ ముద్ర వేశాడు హను రాఘవపూడి. అతన్నుంచి మరిన్ని ఎపిక్ బ్లాక్ బస్టర్స్ రావాలని, ప్యాన్ ఇండియా స్థాయిలో చాలా పెద్ద దర్శకుడు కావాలని ఆకాంక్షిస్తూ.. హను రాఘవపూడికి టివి5 ఎంటర్టైన్మెంట్ టీమ్ బర్త్ డే విషెస్ చెబుతోంది.

Tags:    

Similar News