Hari Hara Veera Mallu: పవన్ సినిమా.. లేటెస్ట్ అప్‌డేట్

Hari Hara Veera Mallu: టాలీవుడ్ బాక్సాఫీస్ గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్‌ నుంచి ఓ సినిమా వస్తోందంటే ఫ్యాన్స్ లో పూనకాలు.. ప్రభుత్వాలకు వణుకులు మామూలే.

Update: 2022-12-23 11:06 GMT

Hari Hara Veera Mallu: టాలీవుడ్ బాక్సాఫీస్ గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్‌ నుంచి ఓ సినిమా వస్తోందంటే ఫ్యాన్స్ లో పూనకాలు.. ప్రభుత్వాలకు వణుకులు మామూలే. ఈ యేడాది భీమ్లా నాయక్ గా సాలిడ్ హిట్ అందుకున్న పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు.



క్రిష్‌ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ చిత్రానికి ఏఎమ్ రత్నం నిర్మాత. వీరి కాంబోలో గతంలో ఖుషీ, బంగారం చిత్రాలు వచ్చాయి. ఖుషీ ఎవర్ గ్రీన్ రొమాంటిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బంగారం మాత్రం యావరేజ్ అనిపించుకుంది. మళ్లీ ఇన్నాళ్లకు సెట్ అయిన కాంబో కావడంతో అంచనాలున్నాయి.



అందుకు తగ్గట్టుగానే ఇది పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోన్న సినిమా. ఔరంగజేబ్ కాలంలో సాగే కథ. పవన్ కళ్యాణ ఈ చిత్రంలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఔరంగజేబ్ గా కనిపించబోతున్నాడు.



అతని సోదరి రోషనారగా నర్గీస్ ఫక్రీ నటిస్తోంది. ఇక లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ లోకి మరో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా యాడ్ అయ్యాడు అంటున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే.. రీసెంట్ గా హరిహర వీరమల్లుకు సంబంధించి ఓ భారీ షెడ్యూల్ ను ఫినిష్ చేశారు.



ఫిల్మ్ సిటీలో వేసిన సెట్స్ లో ఈ కీలకమైన సీన్స్ ను షూట్ చేశారట. దీంతో పవన్ కు సంబంధించి మేజర్ పార్ట్ చిత్రీకరణ పూర్తయినట్టే అంటున్నారు. మరో మూడు వారాల పాటు ఆయన డేట్స్ అడ్జెస్ట్ చేస్తే సినిమా అయిపోతుందంటున్నారు. ఇప్పుడు పొలిటికల్ గా మరీ హడావిడీ ఏం లేదు కాబట్టి.. మూడు వారాలు ఇవ్వడం పెద్ద మేటర్ కాదు. సో.. చెప్పినట్టుగానే ఈ చిత్రం సమ్మర్ బరిలో మార్చి 30న విడుదల కావడం ఖాయం అనుకోవచ్చు. 

Tags:    

Similar News