Hari Hara Veera Mallu : జూన్ 12 థియేటర్ లోకి హరిహర వీరమల్లు

Update: 2025-05-17 09:30 GMT

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీని జ్యోతికృష్ణ, క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ఏఎం రత్నం నిర్మిస్తోన్న ఈసినిమాలో నిధి అగర్వాల్ ఫిమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తు న్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే లేటెస్టుగా ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. 'హరిహర వీరమల్లు' జూన్ 12 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురా బోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ధర్మం కోసం యుద్ధం మొదలైందంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇందులో పవన్ కత్తి పట్టుకుని సీరియస్ గా చూస్తున్న మాస్ లుక్ ఆకట్టు కుంటోంది.

Tags:    

Similar News