Hebah Patel : హెబ్బా బంజారా లుక్.. ఫొటోలు వైరల్

Update: 2025-05-20 07:45 GMT

టాలీవుడ్ నటి హెబ్బా పటేల్ బంజారా లుక్ లో ఫ్యాన్స్ ను పిదా చేస్తోంది. 'కుమారి 21ఎఫ్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అమ్మడు. తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఈ సినిమా భారీ హిట్ అవ్వడంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటించి మెప్పించింది. కానీ స్టార్ హీరోయిన్ రేంజికి మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా లో యాక్టీవ్గా ఉండే ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోస్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా హెబ్బా పటేల్ తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో బంజారా స్టైల్ లో డ్రెసెప్ అయింది. ఇక ఈ పిక్స్ కు 'జీ అప్సర అవార్డ్స్ 2025 కోసం తిరిగి వేదికపైకి అంటూ ట్యాగ్ లైన్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా హెబ్బా గ్లామర్ రోల్స్ లో నటించడం పై షాకింగ్ కామెంట్స్ చేసింది. హెబ్బా పటేల్ గ్లామర్ పాత్రలు చేయడానికి కారణం అప్పట్లో ఆమె ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు అని తెలిపింది. అప్పుడు అలాంటి పాత్రల గురించి నన్ను గైడ్ చేసేవాళ్లు లేరు. దాంతో ఆ సినిమాలను, అలాంటి పాత్రలను నేను ఒక జాబ్ లాగానే చేశాను. డబ్బులు తీసుకున్నాను.. ఇప్పుడు నేను బాగా సెటిల్ అయ్యాను.. ఇప్పుడు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటున్నా.. అని తెలిపింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News