మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ తెరకెక్కించిన కంచె మూవీతో స్టార్ డం దక్కించుకుంది. ఆతర్వాత ఒకటి, రెండు హిట్స్ వచ్చినా అవి ఆమెకు మూవీ చాన్సులు తెచ్చిపెట్టలేక పోయాయి. అయితే ప్రగ్యా ఇటీవల బాలకృష్ణతో కలిసి వచ్చిన డాకు మహారాజ్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రెసెంట్ తెలుగులో ఈ అమ్మడు అఖండ 2 సినిమాలో నటించే అవకాశాలు దక్కించుకుంది. అయినా కెరీర్లో నిలదొక్కుకోవడం కోసం పదేళ్లుగా ఇండస్ట్రీలో ఆఫర్ల కోసం కుస్తీ పడుతుంది. సక్సెస్ దక్కాలి, మంచి పాత్ర పడాలని ఈభామ చాలా కాలంగా వెయిట్ చేస్తుంది. అయితే సినిమా చాన్సులు ఎలా ఉన్నా రెగ్యులర్ గా మాత్రం సోషల్ మీడియా ద్వారా ఫాలోవర్స్, అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. తాజాగా ఇన్స్టా వేదికగా ఫొటోలను షేర్ చేస్తూ ‘హల్ మార్చి' అంటూ పోస్టు చేసింది. కాగా.. వయ్యారాలు ఒలకబోస్తూ కవ్విస్తున్నట్లుగా ఇచ్చిన ఈ అమ్మడి ఫోస్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈస్థాయి అందాల ఆరబోత కేవలం ప్రగ్యా జైస్వా లేకే సాధ్యం అంటూ నెట్టింట కామెంట్ చేస్తున్నారు. ఇంత అందం ఉన్నా కూడా ఈభామకి సరైన ఆఫర్లు రాకపోవడం విడ్డూరంగా ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.