Akhanda 2 : అఖండ 2 రిలీజ్ అయ్యే డేట్ ఇదే

Update: 2025-12-06 08:43 GMT

అఖండ 2 రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ కావడంపై అభిమానుల్లో తీవ్రమైన నిరాశ కనిపించింది. అదే టైమ్ లో ఆ వెంటనే వారు తేరుకున్నారు. మూవీ ఎంత లేట్ అయినా నష్టం లేదు. వచ్చిన టైమ్ కు మాత్రం బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనిపించేలా మారిపోయారు. బట్ అలా అనుకున్నంత సులువు కాదు కదా.. పోస్ట్ పోన్ విషయం. అసలు ఎందుకు వాయిదా పడింది..? అందుకు కారణాలేంటీ.. ? దీని వెనక ఉన్నది ఎవరు..? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మాత్రం రావాలి కదా. ఆ సమాధానాలు మాత్రం నిర్మాతలకు రావాల్సిన పరిస్థితి. మొత్తంగా ఈ మూవీ రిలీజ్ విషయంలో మాత్రం ఓ క్లారిటీ వచ్చినట్టే కనిపిస్తోంది అంటున్నారు.

ఇక రిలీజ్ డేట్ వాయిదా పడిన తర్వాత కొత్త రిలీజ్ డేట్ కోసం చూస్తూ ఉంటారు కదా ఆడియన్స్. అయితే రిలీజ్ డేట్ విషయం ఇతర సినిమాలపై లేదు. ఒకవేళ ఉన్నా.. ఆల్రెడీ డేట్ వాసిన సినిమాలపై అఖండ 2 పడుతుంది. అంటే ఆల్రెడీ రిలీజ్ డేట్ వేసిన వాళ్లంతా బిక్కు బిక్కుమంటూ ఉండిపోతున్నారన్నమాట. మామూలుగా అయితే ఈ నెల 12నే రిలీజ్ అవుతుందంటున్నారు. కానీ మళ్లీ ప్రమోషన్స్ చేయడం.. దాంతో పాటు ఆ రోజున అరడజనుకు పైగా చిత్రాలు మాత్రం రిలీజ్ ఉండటం మాత్రం అఖండ 2కు సమస్యే అవుతుంది. అందుకే తీరిగ్గా మూవీ ప్రమోషన్స్ ను మళ్లీ స్టార్ట్ చేసి ఈ నెల 25న క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. మరి క్రిస్మస్ లాంటి సందర్భంలో సనాతన ధర్మం కోసం సినిమా ఉండాల్సి రావడం మాత్రం కాకతాళీయం. ఆ డేట్ న కూడా రిలీజ్ కావడం లేదు అనేది కూడా వినిపిస్తోంది. మరి కొత్త డేట్ ఏంటీ అనేది మాత్రమే పెద్ద ఫజిల్ అనుకోవచ్చు. 

Tags:    

Similar News