Lust Story 2: తమన్నా ప్రేమాయణం పబ్లిసిటీ స్టంటా?
మొన్నటి వరకూ చట్టాపట్టాల్... సడన్ గా విడివిడిగా దర్శనం;
హీరోయిన్ తమన్నా భాటియా ప్రేమ వ్యవహారంపై సినీ ఇండస్ట్రీ పలు అనుమానాలను వ్యక్తం చేస్తుంది. ఈ మధ్య కాలంగా తమన్నా విజయ్ వర్మలు కలిసి కనబడటం లేదని అంటున్నారు. వీరిద్దరిది నిజమైన ప్రేమ కాదని కేవలం వెబ్ సిరీస్ కోసం ప్రేమికుల్లా నటించారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లస్ట్ స్టోరీ 2 లో విజయ్ వర్మ, తమన్నా మొదటిసారి కలిసి నటించారు. అప్పటినుంచి నెటిజన్లు వీరిని గమనిస్తున్నారు. ఇద్దరి ప్రేమ అబద్ధమని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని విజయ్ ఖండించాడు. తమన్నాతో పిచ్చి ప్రేమలో ఉన్నట్లు తెలిపారు.
ఇటీవల తమన్నా రెండు సార్లు బయట కనిపించిందని అయినా విజయ్ తో లేదని అంటున్నారు. మొదటి సారి పిజ్జా పాయింట్ లో కనిపించగా...రెండవ సారి బాహుబలి నటి కనికా ధిల్లాన్ హౌజ్ వార్మింగ్ లో సందడి చేసింది. అప్పుడు కూడా విజయ్ లేకపోవడంతో ఆవిడ ఒంటరిగానే ఉందని అంటున్నారు. అయితే తమన్నా విజయ్ లు వ్యక్తి గత స్పేస్ ను కలిగి ఉంటారని అతను ఇప్పటికే సైన్ చేసిన షెడ్యూల్స్ లో బిజీగా ఉన్నాడని పలువురు అంటున్నారు.
విజయ్ తనకు స్పెషల్ అని తమన్నా ఇప్పటికే తెలిపింది. అయినా వీరిపై నెటిజన్లు చూసే తీరు మాత్రం మారడం లేదు. ఇటీవల తమన్నాను సినిమా ప్రేమదేవతగా అభివర్ణించాడు విజయ్. ఇటీవల తమన్నా నటించిన జైలర్ సాంగ్ బయటకు వచ్చి సంచలనాన్ని సృష్టిస్తోంది.