తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కు బైక్ రేసింగ్ అన్నా, కార్ రేసింగ్ అన్నా చాలా ఇష్టం అని అందరికీ తెలుసు. ప్రొఫెషనల్ గా రేసింగ్స్ లో పార్టిసిపేట్ చేస్తుంటాడు. తన ప్యాషన్ కొద్దీ ఆ మధ్య వలిమై అనే సినిమా కూడా చేశాడు. ఇందులో డూప్ లేకుండా బైక్ విన్యాసాలన్నీ తనే చేశాడు. అత్యంత ప్రమాదకరమైన స్టంట్స్ ను కూడా అలవోకగా చేశాడు. కొన్నాళ్ల క్రితం కార్ రేసింగ్ లో పార్టిసిపేట్ చేస్తుండగా అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టి ప్రమాదానికి గురయ్యాడు. అప్పుడు ఆయన ఆ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు.
ప్రస్తుతం అతను హీరోగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతోంది. అజిత్ లేకుండానే మొత్తం టీమ్ అంతా రీసెంట్ గా సక్సెస్ సంబరాలు కూడా నిర్వహించుకుంది. ఇలా వీళ్లు సక్సెస్ సంబురాల్లో ఉంటే అజిత్ మరోసారి బెల్జియంలో జరుగుతున్న కార్ రేసింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు.
ఈ క్రమంలో రేస్ జరుగుతుండగా అతని కార్ రేస్ ట్రాక్ నుంచి పక్కకు దూసుకుపోయిందట. ఈ ప్రమాదంలో అజిత్ కు పెద్దగా గాయాలు కాలేదు. యాక్సిడెంట్ నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఏదేమైనా ఈ వయసులో కొన్నిటిని అవాయిడ్ చేసుకుంటేనే మంచిది. ఎంత ప్యాషన్ ఉన్నా.. అతన్ని నమ్ముకుని ఫ్యామిలీ ఉంది కదా.. అంటున్నారు చాలామంది.