టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రతినిధి 2 హీరోయిన్ సిరీ లెల్లతో ఆయన పెళ్లి జరగనుంది. 2024 ఆక్టోబర్ 14వ తేదీ ఉదయం వీరి ఎంగేజ్‌మెంట్ వేడుక హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు, ఇరు కుటుంబాల పెద్దలతోపాటు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. వీరి ఎంగేజ్‌మెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నవంబర్ లో వీరి వివాహం ఉంటుందని సమాచారం. కాగా సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కుమారుడే నారా రోహిత్. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రోహిత్. బాణం. సోలో, ప్రతినిధి, రౌడీ ఫెలో, జో అచ్యుతానంద చిత్రాలతో మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. తాజాగా చేసిన ప్రతినిధి2 సినిమా షూటింగ్ టైమ్ లో నటి సిరీతో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు.