Actor Rana : నేడు ED విచారణకు హీరో రానా

Update: 2025-08-11 04:34 GMT

టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఈ రోజు (ఆగస్టు 11) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరు కావాల్సి ఉంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసుకు మనీలాండరింగ్ కేసులో భాగంగా ఈడీ ఆయనను విచారిస్తోంది. నిజానికి గతంలోనే ఈడీ రానాకు సమన్లు జారీ చేసింది, అయితే షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల ఆయన హాజరు కాలేకపోయారు. దీంతో ఈడీ తాజాగా మరో తేదీని కేటాయించింది. ఇదే కేసులో నటులు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి వంటి పలువురు సినీ ప్రముఖులను కూడా ఈడీ విచారించింది. ఈ కేసులో భాగంగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసినందుకు గాను రానా, ఇతర ప్రముఖులు కూడా విచారణను ఎదుర్కొంటున్నారు. ఈడీ ఈ వ్యవహారంపై ఐదు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈ విచారణ జరుగుతోంది. ఇదే కేసులో ఇప్పటికే నటుడు ప్రకాశ్ రాజ్, హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యారు. తమ వెర్షన్ చెప్పుకొచ్చారు. ప్రకాశ్ రాజ్‌ని 6 గంటలు విచారించగా, విజయ్ దేవరకొండని అధికారులు 4 గంటల పాటు విచారించారు. మరి రానా ఈరోజు విచారణకు హాజరవుతాడా లేదా అనేది చూడాలి? అలానే ఈ బుధవారం అంటే 13వ తేదీన మంచు లక్ష‍్మి హాజరు కావాల్సి ఉంది.

Tags:    

Similar News