Hero Sri Ram : ఊహించిన విధంగా డ్రగ్స్ కేస్ లో చిక్కిన హీరో

Update: 2025-06-24 10:36 GMT

రోజాపూలు, ఒకరికి ఒకరు మూవీస్ తో తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమైన శ్రీరామ్ (తమిళ్ లో శ్రీకాంత్) అనుకోకుండా డ్రగ్స్ కేస్ లో ఇరుక్కున్నాడు. మామూలుగా డ్రగ్స్ ను తీసుకుంటున్నప్పుడు లేదా ఏదైనా పార్టీస్ లోనో దొరికిపోతారు. కానీ ఇతను మాత్రం సినిమా ఫక్కీలో పోలీస్ లకు చిక్కాడు. సినిమా భాషలో చెబితే విలన్స్ అంతా కొట్టుకుని హీరోను ఏసేసినట్టు .. హీరోలా కనిపించిన ఈ విలన్ ను కూడా పట్టించారన్నమాట.

తాజాగా తమిళనాడులోని మైలాపూర్ లోని ఓ బార్ లో గొడవ జరిగింది. ఈ గొడవలో అన్నాడిఎమ్ కే పార్టీకి చెందిన ప్రసాద్, అజయ్, సునామీ సేతుపతిలను పోలీస్ లు అరెస్ట్ చేశారు. అదే టైమ్ లో ప్రసాద్ పై కొన్ని చీటింగ్ కేస్ లు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో విచారణ జరుపుతున్నప్పుడు సదరు ప్రసాద్ డ్రగ్స్ సేవించడమే కాక.. పెడలర్ గానూ పనిచేశాడని తేలింది. అతను ప్రధానంగా నటుడు శ్రీరామ్ కు ఏకంగా 40 సార్లకు పైగా డ్రగ్స్ ను విక్రయించాడని తేలింది. ఒక్క గ్రామ్ కు 12 వేలు చెల్లిచేవాడట శ్రీరామ్. అంటే దాదాపు ఐదు లక్షల వరకూ డ్రగ్స్ కోసం ఖర్చుపెట్టాడీ నటుడు. దీంతో నుంగంబాక్కం పోలీస్ లు శ్రీ రామ్ ను విచారించారు. అతన్ని పరీక్షించారు. ఈ పరీక్షల్లో హీరోగారు డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. వెంటనే శ్రీ రామ్ ను కూడా అరెస్ట్ చేశారు. సో.. బార్ లో గొడవ జరగకపోతే ఈ విషయం తెలిసేది కాదు. శ్రీరామ్ అరెస్ట్ అయ్యేవాడు కాదు. కానీ తప్పు చేసినవాళ్లు ఎప్పటికైనా దొరికిపోతారు. శిక్షించబడతారు అనేందుకూ శ్రీరామ్ ఉదంతం ఓ ఉదాహరణ.

Tags:    

Similar News