యూట్యూబర్ హర్ష సాయి కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించిన హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ, ఇమ్రాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కేసులో నిందితులుగా చేర్చక ముందే ముందస్తు బెయిల్ ఎలా మంజూరు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. హర్ష సాయితో పాటు అతడి తండ్రి రాధాకృష్ణ, ఇమ్రాన్ పై ఇప్పటికే బాధితురాలు ఫిర్యాదు చేసింది. హర్ష సాయి, బాధితురాలికి పెళ్లి చేయాలని రాధాకృష్ణ నే ప్రపోజల్ పెట్టారని హర్షసాయి తరుపు న్యాయవాది వాదించారు. ఫిర్యాదులో మాత్రం హర్ష సాయి తండ్రి కూడా పెళ్లి చేస్తానని చెప్పి తనను మోసం చేశాడని బాధితురాలు పేర్కొంది. విచారించిన కోర్టు ముందోస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది.