గుణశేఖర్ ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ గా తిరుగులేని ఫామ్ చూపించాడు. బట్ ఈ మధ్య అది తగ్గిపోయింది. గతంలో బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. ఈ మధ్య హిట్స్ కూడా ఇబ్బంది పడుతున్నాయి. అలాంటి దర్శకుడు ఈ సారి యూఫోరియాతో వస్తున్నాడు. ఈ మూవీ టీజర్ గతంలోనే ఒక డిఫరెంట్ మూవీలా ఉంటుంది అనిపించింది. ఖచ్చితంగా ఈ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు గుణశేఖర్ అనిపించాడు. టీజర్ తర్వాత ట్రైలర్ కు చాలా ఎక్కువ టైమ్ తీసుకున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశాడు.
యూఫోరియా మూవీ ట్రైలర్ చూడగానే ఇది ఓ కాన్సెప్ట్ బేస్డ్ మూవీలా కనిపిస్తోంది. వాస్తవ సంఘటనల నేపథ్యంలో రాసుకున్న కథలా ఉంది. సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న ఒక అమ్మాయి.. ఓ పార్టీకి వెళుతుంది. ఇది కూడా తన సివిల్స్ ప్రిపరేషన్ లోనే భాగంగా అంటూ తండ్రి కూడా ఎంకరేజ్ చేస్తాడు. కానీ ఆ రాత్రి తన జీవితంలో అనూహ్యమైన ఘటన జరుగుతోంది. ఈ కారణంగా తన లైఫ్ మారిపోతుంది. జీవితం దారుణంగా మారిపోతుంది. మరోవైపు భూమిక పాత్ర కూడా బలంగా ఉండబోతోంది అనిపించేలా ఉంది. తనపైనే ఓ కేస్ పెట్టిన మహిళగా కనిపిస్తుంది. మరి తనపై తనే కేస్ ఎందుకు వేసింది అనేందుకు బలమైన కారణాలు కనిపిస్తాయి. మరోవైపు డ్రగ్స్ కారణంగా యువత ఎలా పెడత్రోవ పడుతుంది.. అందులో భాగంగా తమ జీవితాలను నాశనం చేసుకోవడం మాత్రమే కాకుండా ఇతరుల లైఫ్ ను కూడా స్పాయిల్ చేస్తారు అనేలా ఉంది.
మొత్తంగా ట్రైలర్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ కంటే కూడా కాన్సెప్ట్ హైలెట్ అయ్యేలా కట్ చేశారు. గుణశేఖర్ ఈ సారి తనదైన స్టైల్ మార్చినట్టు కనిపిస్తోంది. సారా అర్జున్, భూమిక, నాజర్, రోహిత్, విఘ్నేష్, లిఖిత, గౌతమ్ మీనన్ కీలక పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 6న ఈ చిత్రం విడుదల కాబోతోంది. మరి ఈ మేరకు కావాల్సినంత ప్రమోషన్స్ కూడా చేయొచ్చు. మరి ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.