Varun Tej : వాళ్ళని మర్చిపోతే ఎలా?....వరుణ్ తేజ్ ఆసక్తికర కామెంట్స్

Update: 2024-11-12 06:15 GMT

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. మనకు సుప్పొర్ట్ చేసి, మన ఎదుగుదలకు కారణమైన వాళ్ళని మర్చిపోతే ఎంత సాధించిన వ్యర్ధమే అన్ని చెప్పుకొచ్చాడు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే? వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ మట్కా. కరుణకుమార తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా నవంబర్ 14న విడుదల కానుంది ఈ సినిమా. తాజాగా జరిగిన మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వరుణ్ మాట్లాడుతూ "మా పెదనాన్న, బాబాయ్ నా గుండెల్లో ఉంటారు. అందరూ వాళ్ళ గురించే ఎందుకు మాట్లాడతావు అని అడుగుతారు. మా పెదనాన్న, బాబాయ్, అన్నయ్య చరణ్ గురించి నేను మాట్లాడుతాను. అది నా ఇష్టం. లైఫ్ లో నువ్వు పెద్దోడివి అవ్వొచ్చు అవ్వకపోవచ్చు. కానీ నువ్వు ఎందుకు, ఎక్కడ మొదలుపెట్టావు, నీ వెనక సపోర్ట్ ఎవరు ఇచ్చారు అని నువ్వు మర్చిపోతే నీ సక్సెస్ ఎందుకు పనికిరాదు" అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News